DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Admin
DNB News