DNB News - ఆంధ్రప్రదేశ్ / : కౌతాలం నుండి ఆదోని వైపు RTC బస్సులో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు విశాల్ మార్ట్ సమీపంలో బస్సు దిగిన అనంతరం తన బ్యాగ్ బస్సులోనే మరిచిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆమె RTC బస్ స్టాండ్‌కు వెళ్లి డ్రైవర్‌ను సంప్రదించగా, బస్సులో వెతికినా బ్యాగ్ లభించలేదు. దీంతో సాయంత్రం సుమారు 3.30 గంటలకు ఆమె ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని సీఐ పి. చంద్ర శేఖర్ కి ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మానంద రెడ్డి, కానిస్టేబుల్ సజ్జన్ మరియు విజయ్ కుమార్‌లు వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, బస్సు డ్రైవర్ అందించిన సమాచారంతో ఆదోని పట్టణంలో గాలింపు చేపట్టారు. పోలీసుల చాకచక్యంతో సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో బాధితురాలి బ్యాగ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకొని ఆమెకు అందజేశారు. ఆ బ్యాగ్‌లో సుమారు రూ.6,00,000/- విలువ చేసే 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడైంది. పోలీసుల వేగవంతమైన స్పందనకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ పి. చంద్ర శేఖర్ గ సూచించారు.
Admin
DNB News