Saturday, 27 June 2026 04:28:04 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ..

Date : 09 June 2026 10:14 AM Views : 30

DNB News - ఆంధ్రప్రదేశ్ / : గుడిసె ఆది కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదోనిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు సాధించి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తారని ఆమె అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, మదిరే భాస్కర్ రెడ్డి, హౌసింగ్ డైరెక్టర్ రామకృష్ణ, విట్ట రమేష్, గోనెహళ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :