Saturday, 27 June 2026 05:21:04 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

ఆదోని ఇండోర్ స్టేడియం పనులు వెంటనే పూర్తి చేయాలి – SFI డిమాండ్..

Date : 10 April 2026 04:16 PM Views : 82

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని విట్టా కిష్టప్ప నగర్లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని వెంటనే పూర్తి చేయాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ, 2018లో టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక విట్టా కిష్టప్ప నగర్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2017-18లో ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైందని చెప్పారు. అయితే, గత ఐదేళ్లుగా పనులు పూర్తిగా నిలిచిపోయి, మొండి గోడలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా స్థానిక క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయిన ఈ స్టేడియం మిగిలిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆదోని ప్రాంతం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులు వెలుగొందుతున్నారని, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పందించి పనులను వేగవంతం చేయాలని కోరారు. లేకపోతే, SFI ఆధ్వర్యంలో క్రీడాకారులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :