Saturday, 27 June 2026 05:18:44 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

జిల్లా కోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..

Date : 04 March 2026 10:22 AM Views : 97

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జడ్జి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా కోర్టు ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కోర్టులతో పాటు జిల్లాలోని అన్ని కోర్టు ఆవరణాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పర్మనెంట్ సెక్యూరిటీ యూనిట్లు, సెక్యూరిటీ రూమ్స్, గస్తీ విధులు, ప్రవేశ–నిష్క్రమణ గేట్లు, పార్కింగ్ ప్రదేశాలపై అధికారులు ఆరా తీశారు. మంగళవారం ఫోక్సో జడ్జి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా పరంగా కోర్టు ప్రాంగణంలోని నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పనితీరు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను సమీక్షించారు. కోర్టు విచారణకు హాజరయ్యే ఖైదీల భద్రతపై అవసరమైన సూచనలు చేశారు. కోర్టు ప్రాంగణంలో అనుమానాస్పద వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ఏఓ సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసుధన్ రావు, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్యనాయుడు, కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :