DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 30 ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, మోటార్ వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అదేవిధంగా వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్లు అమర్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, వాహనాలకు నంబర్ ప్లేట్లు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Admin
DNB News