DNB News - తెలంగాణ / : గొల్లపల్లి లక్ష్మీ నర్స్ గౌడ్, రామ తులసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రెడ్డిగూడెం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా, ఏలూరు జిల్లా విలేరుపాడు మండలం రేపాక గొమ్ము ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విథులు నిర్వహిస్తున్నారు . ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని రెడ్డిగూడెం మరియు రేపాక గోమ్ము పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... 28 సంవత్సరాలు సుదీర్ఘకాలం విద్యార్ధులకు అమూల్యమైన సేవలు అందించి వారిలో విజ్ఞాన దృక్పథాన్ని పెంపొందించి అహర్నిశలు విద్యను విద్యార్థుల అభివృద్ధికై తప్పించి విద్యార్థులను ఉన్నత లుగా తీర్చి దిద్దిన గొల్లపల్లి లక్ష్మీ నర్స్ గౌడ్, రామ తులసిని ప్రశంసలు కురిపించారు . లక్ష్మీ నర్స్ గౌడ్, కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంసలు పత్రాన్ని అందించారు. పదవి విరమణ పొందిన రామ తులసికి లక్ష్మీ నర్సు గౌడ్ కి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంఈఓ లు పూలమాలవేసి బొకేలు అందించి ఘనంగా సత్కరించారు. ఎం ఈ ఓ కూరం శ్రీనివాసరావు మాట్లాడుతూ... భార్య భర్తలు గా ఉండి ఉపాధ్యాయ వృత్తిలో ఒకేసారిగా ఉద్యోగ విరమణ అవ్వటం వాళ్ల అదృష్టంగా భావించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు ప్రసాదరావు,చిటికని సత్యనారాయణ శరీరం బుచ్చయ్య, ఉపాధ్యాయులు, రాంబాబు, కృష్ణారావు, సిద్దు ఫ్రం శ్రీకాకుళం, చిర్రీ దేవరాజు పాలెం రమేష్ కారం నాగేశ్వరరావు, పురేం సీతారామ లక్ష్మయ్య, ఇరప సూర్యచంద్రరావు, కారం జగ్గారావు, కారం రాములు విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News