Saturday, 27 June 2026 05:21:04 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

రైతులను విస్మరించిన ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు

Date : 11 April 2026 11:03 AM Views : 66

DNB News - తెలంగాణ / : రైతులను విస్మరించిన ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు – రుణ మాఫీ, గిట్టుబాటు ధరలపై సిపిఐ–AIKS హెచ్చరిక.. ఆదోని మండలం (1) విరుపాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (AIKS) 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రైతు తిక్కన్న గారు రైతు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు, ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో రైతు సంఘం స్థాపించబడిందని, ఆంధ్రప్రదేశ్‌లో 1928లో గుంటూరులో రైతు ఉద్యమాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మద్దతు ఇస్తూ రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, ఎరువులు, పురుగుమందుల కంపెనీలకు మాత్రం అధిక లాభాలు కల్పిస్తున్నారని విమర్శించారు. డిమాండ్లు: బ్యాంకులలో రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధరలు ప్రకటించాలి (వరి క్వింటాల్‌కు ₹3000 కొనుగోలు) 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు ₹10,000 పెన్షన్ ఇవ్వాలి వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కనీసం 30% నిధులు కేటాయించాలి కౌలు రైతులకు రక్షణ చట్టం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి వ్యవసాయ యంత్రాలకు 90% సబ్సిడీ, ప్రతి రైతుకు ₹5 లక్షల భీమా కల్పించాలి భూ సేకరణ చట్టం (2013) అమలు చేయాలి మార్కెట్ కమిటీల ద్వారా పంటలను కొనుగోలు చేసే విధానం బలోపేతం చేయాలి అభివృద్ధి పేరుతో పేద రైతుల భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టే విధానాలను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు సుంకప్ప, నరసింహులు, గోపి, రంగనాథ్, మారెప్ప, ఏసోబు రాజు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :